అందాల సుందరిని వేధిస్తున్న అరుదైన సమస్య

ఇరవై ఒక్కేళ్ల తరువాత భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చింది హర్నాజ్ కౌర్ సంధు.



అయిదడుగుల తొమ్మిది అంగుళాల ఈ నిలువెత్తు అందాన్ని చూసి ప్రపంచమే మురిసింది.



హర్నాజ్ ఇటీవల బాడీ షేమింగ్ బారిన పడింది. దానికి కారణం ఆమె కాస్త లావు కావడమే.

హర్నాజ్ సెలియాక్ వ్యాధితో బాధపడుతోంది.



ఈ వ్యాధి వల్ల ఒక వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ సొంత శరీరంపైనే వ్యతిరేకంగా పనిచేస్తుంది.

వీరు గ్లూటెన్ ఉండే ఆహారాలు తినకూడదు. అంటే గోధుమపిండితో చేసే వంటలేవీ తినకూడదు.



ఈ వ్యాధి వల్ల పోషకాహారలోపం, ఎముక సాంద్రత తగ్గిపోవడం, సంతానోత్పత్తి సమస్యలు ఉత్పన్నమవడం, నాడీ సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.



ఈ వ్యాధి లక్షణాలు మలబద్ధకం, కాళ్లలో తిమ్మిరి, విరేచనాలు, రుతుచక్రం క్రమంగా లేకపోవడం, దంతాల రంగు మారడం, కడుపునొప్పి, కడుపుబ్బరం, కండరాల తిమ్మిరి, కీళ్లనొప్పులు, చర్మం దురద, గ్యాస్ట్రిక్, పిల్లలు పుట్టకపోవడం... ఇలా ఉంటాయి.



ఈ వ్యాధి ఎందుకొస్తుందో తెలియదు కానీ, వారసత్వంగా వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు.