ఐపీఎల్ 2022లో చెన్నైకి వరుసగా మూడో ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో 54 పరుగుల తేడాతో చెన్నై చిత్తుగా ఓడిపోయింది.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

అనంతరం చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది.

అర్థ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు కూడా తీసుకున్న లివింగ్‌స్టోన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

పంజాబ్ బ్యాటర్లలో లియాం లివింగ్‌స్టోన్ (60: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు), శిఖర్ ధావన్ (33: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు.

చివర్లో పంజాబ్ తడబడటంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితం అయింది.

మొదటి 10 ఓవర్లలో 109 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్, చివరి 10 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

ఇక చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది.

శివం దూబే (57: 30 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.

మహేంద్ర సింగ్ ధోని (23: 28 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) చివర్లో వేగంగా ఆడటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
(All Images Credit: BCCI/IPL)