అన్నింట్లో బెస్ట్ వ్యాయామం ఈతే ఈత కొట్టడం మంచి వర్కవుట్ల జాబితాలోకే వస్తుంది. ఈత కొట్టడం వల్ల ఎన్నో మానసిక, శారీరకపరమైన ఆరోగ్య లాభాలు ఉన్నాయి. పొట్ట కొవ్వు తగ్గుతుంది. కండరాలను బలంగా చేస్తుంది. గుండెకు ఎంతో మంచిది. శరీర బరువును తగ్గిస్తుంది. శరీరాన్ని మంచి షేప్‌లోకి మారుస్తుంది. ఈత వల్ల ఆకలి సకాలంలో వేస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల శక్తి సామర్థ్యాలను కూడా ఈత పెంచుతుంది. వయసు పెరిగిన ఆనవాళ్లను త్వరగా కనిపించనీయదు. ఒత్తిడిని తగ్గించి, నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.