యూనివర్శిటీ ఆఫ్ వోర్సెస్టర్ పరిశోధనలో ప్రోటీన్ ఫుడ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అధిక ప్రోటీన్ పురుషులలో టెస్టోస్టెరాన్‌ను 37 శాతం తగ్గిస్తుంది. సెక్స్‌పై ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఈ సమస్యను ‘హైపోగోనాడిజం’ అంటారు. అదే ఏర్పడితే ఇక పిల్లలను కనడం కష్టమవుతుంది. తక్కువ టెస్టోసెరాన్ సమస్యలు స్మెర్మ్ కౌంట్‌ను బాగా తగ్గిస్తాయి. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది ప్రోటీన్ పాయిజనింగ్ వల్లే సంతాన సమస్యలు, వ్యాధులు ఏర్పడతాయి. ప్రోటీన్ అమ్మోనియాగా విచ్ఛిన్నమై విషంగా మారుతుంది. దీన్నే ‘ప్రోటీన్ పోయిజనింగ్’ అని అంటారు. ప్రోటీన్‌లు తీసుకోవడం మంచిదే. కానీ, అది 15 నుంచి 25 శాతానికి మాత్రమే పరిమితమై ఉండాలి. బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ సూచన ప్రకారం మన బరువు ఆధారంగా ప్రోటీన్లు తీసుకోవాలి. రెండు వారాల్లో 35 శాతం కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే.. అది ఆరోగ్యానికే ప్రమాదకరం. Videos and Images Credit: Pixels