శుభకృత్ నామసంవత్సర ధనస్సు రాశి ఫలితాలు ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఆదాయం : 2, వ్యయం : 8, రాజ్యపూజ్యం : 5, అవమానం : 1
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ధనస్సు రాశివారికి గురుడు చతుర్థంలో, శని ధనస్థానంలో , రాహుకేతువులు 5,11 స్థానాల్లో ఉన్నందున గతేడాది కన్నా పరిస్థితులు అనకూలంగా ఉంటాయి.
ఏపని చేసినా సక్సెస్ అవుతారు. ఇంటా-బయటా గౌరవం పొందుతారు.
గతేడాది నుంచి పెండింగ్ లో పడిన పనులు ఈ ఏడాది సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసేస్తారు ఆదాయం తక్కువ...ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం అస్సలు ఉండవు..
కొత్త ప్రణాళికలు రచించి వాటిని అమలు చేసి సక్సెస్ అవుతారు తమ చాతుర్యంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఇంట్లో శుభాకార్యాలు నిర్వహించే సూచనలున్నాయి
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి, కాంట్రాక్టులు చేసేవారికి అంతా అనుకూల సమయం, ఉమ్మడి వ్యాపారాలు అనుకూలించవు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు
స్థిరాస్తుల్లో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల అధికంగా లాభపడతారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి దైవబలంతో ఆపదలు తొలగిపోతాయి
ఉద్యోగుల తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు కేతువు లాభ స్థానంలో ఉండటం వల్ల స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి
గురు, శని వల్ల చిన్న చిన్న విఘ్నాలు ఎదురైనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దు విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మంచి ఫలితాలు సాధిస్తారు
అవివాహితులకు పెళ్లిజరిగే సూచనలున్నాయి న్యాయ, వైద్య రంగాల్లో ఉన్నవారికి ఆదాయాభివృద్ధి ఉంటుంది
ఏదైనా వ్యవహారంపై ముందు అడుగు వేసేందుకు భయపడతారు మీ ఓర్పు, మీ మౌనమే మీకు శ్రీరామరక్ష..మీరు అనుసరించే న్యాయం మీకు సహకరిస్తుంది
అనారోగ్య సమస్యల గురించి ఎక్కువ ఆలోచించడం తగ్గించి...ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, ఒత్తిడిని తగ్గించుకోండి
రక్తసంబంధీకులతో వివాదాలుంటాయి సోదరుల మధ్య ఆస్తి వ్యవహారాలు ప్రస్తావనకు వస్తాయి, ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు
స్త్రీ మూలకంగా ధనలాభం ఉంటుంది
ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న చిన్న సమస్యలు మినహా ఈ ఏడాది ధనస్సు రాశివారికి అన్నివిధాలుగా శుభసమయమే....