మీకు టాటూ ఉందా? ఈ దేశాలకు వెళితే జాగ్రత్త

ప్రపంచంలోని చాలా దేశాల్లో టాటూలు అంగీకారం కావు. కొన్ని దేశాల్లో వాటిపై నిషేధం విధించారు.

మీకు పచ్చబొట్టుందా? అయితే ఈ దేశాలకి వెళ్లేటప్పుడు ఆ పచ్చబొట్టు కనిపించకుండా చేసే దుస్తులు వేసుకుంటే ఉత్తమం.

జపాన్లో పచ్చబొట్టు చట్ట విరుద్ధం కాదు కానీ, ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం టాటూ కనిపిస్తే తరిమికొడతారు.

వియత్నాంలో పచ్చబొట్టు వేయించుకోవడం, అలాంటి పనిలో ఉండడం కూడా చట్టవిరుద్ధం.

విద్యార్ధులకు మేకప్, టాటూలు వేయాడాన్ని టర్కీ ప్రభుత్వం నిషేధించింది.

ఉత్తరకొరియాలో టాటూలపై నిషేధం లేదు. కానీ ఏ పదాన్ని టాటూగా వేయించుకుంటున్నారు, ఎలాంటి బొమ్మలు వేయించుకోవాలి అన్నదానిపై మాత్రం నియంత్రణ ఉంది.

దుబాయ్ లో కూడా టాటూ నిషేధం.ఒకవేళ వేయించుకున్నా కూడా బహిరంగంగా బయటికి కనిపించనివ్వకూడదు.



దుబాయ్‌లో విదేశీయుల పచ్చబొట్టు అభ్యంతరకరంగా ఉంటే వారిపై జీవితకాలం నిషేధం ఉంటుంది.వారు దుబాయ్ లో మళ్లీ అడుగుపెట్టలేరు.