వయసు 30కి చేరిందంటే నెమ్మదిగా శరీరంలో జీవక్రియ మందగించడం మొదలవుతుంది.

ముఖ్యంగా బోన్ డెన్సిటి తగ్గడం మొదలవుతుంది. ఈ వయసు నుంచే ఎముకల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.

ఉప్పు, చక్కెర ల వినియోగం తగ్గించుకోవాలి. శరీరం కాల్షియం నష్టం తగ్గుతుంది.

టీ, కాఫీ, కోకో, చాక్లెట్ వంటి డ్రింక్స్ లో ఉండే కెఫిన్ కాల్షియం నష్టాన్ని పెంచుతుంది. కనుక వీటిని పరిమితంగా తీసుకోవాలి.

శ్రమ లేని జీవన శైలి కాల్షియం నష్టానికి కారణమవుతుంది. క్రమం తప్పకుండా వాకింగ్, జాగింగ్ వంటివి చెయ్యడం అవసరం.

చేపలు, చికెన్, రెడ్ మీట్ వంటి జంతు సంబంధ ప్రొటీన్ తీసుకోవడం తగ్గించాలి. వీటి వల్ల శరీరంలో కాల్షియం నష్టం పెరుగుతుంది.

చాలా రకాల కూల్ డ్రింక్స్ ఎముకలకు హాని చేస్తాయి. వీటిలో ఉండే చక్కెర, కెఫిన్, ఫాస్ఫోరిక్ యాసిడ్ ఎముకలు కాల్షియంను బయటకు పంపుతాయి.

పొగాకు వినియోగించే అలవాటు ఉన్నవారు ఆ అలవాటు నుంచి బయటపడాలి. నికోటిన్ కాల్షియం శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

కండర పుష్టి పెంపొందించుకోవాలి. తక్కువ కండరసాంద్రత కలిగిన వారిలో కాల్షియాన్ని నిలిపి ఉంచుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels