చలికాలంలో వీటిని తినకూడదు



చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటు కొన్నింటిని దూరంగా పెట్టడం అవసరం.



పండ్ల రసాలు, శీతల పానీయాలు, కేకులు వంటి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది.



ఇలా పంచదార అధికంగా ఉండే ఆహారాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవి రోగనిరోధక శక్తని తగ్గిస్తాయి.



ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన వెంటనే ఆహారాన్ని తినవద్దు, అది గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక మాత్రమే తినాలి.



డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, వేపుళ్ళు వంటి వాటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇలాంటి కొవ్వు పదార్థాలు చలికాలంలో తినడం హానికరం.



ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు చలికాలంలో పాల ఉత్పత్తులను తగ్గించాలి.



గుడ్లు, పుట్టగొడుగులు, టమోటాలు, నట్స్ వంటివి కూడా మితంగా తీసుకోవాలి. అధికంగా తింటే అవి శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోయే అవకాశం ఉంది.



ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం పూర్తిగా తగ్గించాలి. పచ్చి కూరగాయల జోలికి వెళ్ళకూడదు.