గుడ్డు చాలా పోషకాలు కలిగిన తప్పక తీసుకోవాల్సిన ఆహారం.

ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే కాదు వీటితో బరువు కూడా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం గుడ్డు ఆరోగ్యవంతమైన వృద్ధాప్యానికి, ఆకలిని అదుపు చేసేందకు చాలా మంచి ఆహారంగా తేల్చారు.

వారానికి 7-14 గుడ్ల వరకు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయట.

ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్ అందుతాయి. అందువల్ల పుష్టికరమై కండర నిర్మాణానికి దోహదం చేస్తుంది.

పోషణతో పాటు ఆకలిని కలిగించే హార్మోన్లను నియంత్రించి తక్కువ క్యాలరీల వినియోగానికి గుడ్డు దోహదం చేస్తుంది.

ఉదయం పూట తీసుకునే మొదటి ఆహారంగా గుడ్డు తీసుకున్నపుడు రోజంతా జంక్ ఫుడ్ క్రేవింగ్ పూర్తిగా తగ్గిపోతుందట.

మొత్తానికి గుడ్డు అత్యధిక పోషకాలు కలిగిన సహజమైన ఆహారం.
All Images Credit: Pexels