ఈ చిన్న అలవాట్లు స్మోకింగ్ కంటే ప్రాణాంతకం - వెంటనే మానేయండి!

సిగరెట్ స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిసిందే.

అయితే, మీకు తెలియని కొన్ని సాధారణ అలవాట్లు కూడా ప్రాణాంతకం. అవేంటంటే..

అతిగా జంతు మాంసాన్ని తినడం: రెడ్ మీట్, బీఫ్‌లోని కొవ్వులు గుండె సమస్యలను తెస్తాయి.

గంటలకొద్ది ఒకే చోట కూర్చోవడం: ఎక్కువసేపు కూర్చోకుండా కనీసం 45 నిమిషాలకు ఒకసారి లేచి నడవాలి.

ఒంటరితనం: ఇది డిప్రషన్, ఆందోళనకు గురిచేస్తుంది. ఆయుష్షు తగ్గిస్తుంది.

స్ట్రెస్ ఈటింగ్: ఒత్తిడితో అతిగా తినే అలవాటు డయాబెటిస్, ఊబకాయానికి దారితీస్తుంది.

ఇంట్లోనే ఉండటం: సూర్యరశ్మి తగలకపోతే విటమిన్-డి లోపించి అనేక సమస్యలకు దారితీస్తుంది.

నిద్రలేమి: నిద్ర కరువైతే త్వరగా ముసలితనం వస్తుంది. డయాబెటిస్, ఊబకాయం, గుండె సమస్యలు వస్తాయి.

మద్యసేవనం: మద్యపానం క్యాన్సర్, ఊబకాయం, హైపర్టెన్షన్‌కు దారితీస్తుంది.

Images Credit: Pixabay and Pexels