దాల్చిన చెక్క డయాబెటిస్‌ను తగ్గించగలదా?

డయాబెటిస్ రోగులకు దాల్చిన చెక్క చాలామంచిదనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా?

దాల్చిన చెక్క డయాబెటిస్ బాధితులకు మంచిదేనని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ పేర్కొంది.

దాల్చిన చెక్క రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుందట. తాజా అధ్యయనం కూడా ఇదే స్పష్టం చేసింది.

మనుషులపై చేసిన ప్రయోగంలో బ్లడ్ సుగర్, బ్లడ్ ఫ్యాట్స్‌ను తగ్గిస్తున్నట్లు తేలింది.

దాల్చిన చెక్క రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ చేరకుండా అడ్డుకుంటున్నట్లు తెలుసుకున్నారు.

మేలు చేస్తుంది కదా అతిగా తీసుకుంటే కాలేయ సమస్యలు వస్తాయి.

కేవలం ఒకటి నుంచి మూడు గ్రాముల దాల్చిన చెక్కను ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలు.

గమనిక: ఈ సూచనలు పాటించే ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోగలరు.

Images Credit: Pixabay and Pexels