శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. ఇది సక్రమంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. శరీరం నిర్విషీకరణకు కాలేయం బాధ్యత వహిస్తుంది. అందుకే, కాలేయాన్ని క్లీన్‌గా ఉంచుకోవడం మన బాధ్యత. కాలేయాన్ని క్లీన్‌గా ఉంచుకోవడాన్ని లివర్ డిటాక్స్ అని అంటారు. దీనివల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. పచ్చని కాయగూరలు: వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయ కణాలను రక్షిస్తాయి. బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీల్లో బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పండ్లు: యాపిల్స్, బేరి, పీచెస్, పుచ్చకాయ, ద్రాక్షలో కూడా కాలేయ నిర్విషీకరించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఆలివ్ నూనె: ఆలివ్ నూనె కాలేయానికి సురక్షితం. ఇది కాలేయ వాపుకు కారణం కాదు. చేపలు: సాల్మన్, సార్డినెస్, ట్రౌట్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కాలేయాన్ని రక్షిస్తాయి. ఇంకా గుడ్లు, వెన్న, చీజ్ కూడా కాలేయానికి మంచివే. కాబట్టి వీటిలో కొన్నైనా రోజువారీగా తీసుకోవడం మరిచిపోవద్దు. Images Credit: Pexels and Pixabay