పచ్చి బంగాళదుంపలో 'గ్లైకో ఆల్కలైడ్స్' అనే విషపూరితమైన సమ్మేళనాలు ఉంటాయి. అవి జీర్ణవ్యవస్థను అతలాకుతలం చేస్తాయి. లిమా బీన్స్ వండుకొని తినడం సురక్షితం. పచ్చి బీన్స్‌లో సైనైడ్‌గా మారే 'లినామరిన్' అనే సమ్మేళనం ఉంటుంది. పచ్చి రాజ్మ బీన్స్‌లో ఉండే 'లెక్టిన్స్' జీర్ణ కోశ సమస్యలు కలిగిస్తాయి. అందుకే వాటిని వండుకుని తినాలి. పుట్టగొడుగులను సైతం పచ్చిగా తినొద్దు. ముఖ్యంగా అడవిలో దొరికే పుట్టగొడుగులను తాకినా కూడా ప్రమాదమే. పచ్చి గుడ్లను తింటే అనారోగ్యానికి గురవుతారు. అందులో 'సాల్మొనెల్లా' అనే బ్యాక్టీరియా ఉంటుంది. పౌల్ట్రీ, పోర్క్ బీఫ్ మాంసాన్ని కూడా వండుకొనే తినాలి. లేదంటే వివిధ బ్యాక్టీరియాల వల్ల విషతుల్యంగా మారుతుంది. బచ్చలి కూరను పచ్చిగా కంటే వండుకొని తింటేనే మంచిది. అప్పుడే అందులోని ఐరన్, కాల్షియం శరీరానికి అందుతుంది. టమోటాలను కూడా పచ్చిగా తినొద్దు. క్యాబేజీ పచ్చిగా తినవచ్చు. కానీ కొందరికి జీర్ణించుకోవడం చాలా కష్టం. వండుకొని తినడమే మంచిది. బ్రకోలీని పచ్చిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. అందుకే వండుకుని తినాలి. ద బ్రసెల్స్ మొలకలను వండుకొని తింటే చేదు తగ్గుతుంది. 'ఐసోతియోసైనేట్ ' అనే యాంటిక్యాన్సర్ కంపౌండ్స్ కూడా విడుదలవుతాయి. Images Credit: Pixels