మీరెప్పుడైనా ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అది గుండెపోటు అనుకుని భయపడ్డారా?

వాస్తవానికి, ఛాతీలో వచ్చే నొప్పి కేవలం గుండె పోటు లక్షణం మాత్రమే కాదు.

గ్యాస్ లేదా అసిడిటీ వల్ల కూడా ఛాతిలో నొప్పి రావొచ్చు.

ఛాతిలో నొప్పి ప్రమాదకరం కాకపోయినా, తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది.

గ్యాస్ వల్ల ఛాతీలో నొప్పి రాకుండా ఉండటానికి ఈ ఐదు చిట్కాలను పాటించండి.

రోజూ వేడి నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు, సొంపు నీళ్లు, వాము నీళ్లు తాగండి. నీళ్లు శరీరంలోని గ్యాస్ ను నివారిస్తాయి.

రోజూ వ్యాయామం చెయ్యండి. దీనివల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.

ఎక్కువ కారం, నూనె ఉండే పదార్థాలను తినకండి.

రోజుకు ఒక టీ స్పూన్ అల్లం తీసుకోవటం వల్ల అల్లం జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.

గోధుమల్లో ఉండే గ్లూటెన్ పోషకం వల్ల కూడా పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది.

Images Credit: Pixels, Pixabay