చలి కాలంలో పొడి చర్మం , జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలంటే డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి.

డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, బోలెడన్ని పోషకాలు ఉంటాయి. అందుకే వాటిని బ్యూటీ ప్రొడక్ట్స్ లోనూ ఉపయోగిస్తారు.

బాదాంను డ్రై ఫ్రూట్స్‌కు రాజు అని అంటారు. వీటిలోని యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

బాదాం, రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తం లోని 'హిమోగ్లోబిన్' శాతాన్ని పెంచి, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

బాదాం చర్మాన్ని ప్రకాశింపజేస్తుంది.

వాల్‌నట్స్‌లోని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు బలాన్ని ఇస్తాయి.

చలి కాలంలో వాల్నాట్స్ శరీరాన్ని వేడిగా ఉంచుతాయట.

అంజీరాలో మినరల్స్, విటమిన్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి.

అంజీరాలో విటమిన్-A, విటమిన్ బి1, బి2, ఐరన్, కాల్షియం, పాస్పరస్ ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

మైగ్రేన్‌తో బాధపడుతున్న పిల్లలకు జీడిపప్పు చాలా మంచిది.

జీడిపప్పులో ఉండే యాంటి – ఏజింగ్ గుణాలు వయస్సు పెరిగే లక్షణాలను తగ్గిస్తుంది.

జీడిపప్పులో విటమిన్-E అధికంగా ఉండటం వల్ల చర్మానికే కాదు, జుట్టుకు కూడా మేలే!

పిస్తాల్లో ఐరన్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి.

కెరాటినాయిడ్స్, లుటిన్, జియాక్సంతిన్‌‌ను కలిగిన ఒకే ఒక్క డ్రై ఫ్రూట్.. పిస్తా.

Images Credit: Pixabay and Pexel