సీజన్ మారుతున్నప్పుడు రోగాలు వెంటాడుతాయ్. వైరస్‌లు దాడి చేస్తాయ్. అందుకే, ఈ ఫుడ్‌తో ఇమ్యునిటీ పెంచుకోండి.

స్వీట్ పొటాటో: ఇందులోని విటమిన్-ఎ యూవీ రేస్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. చర్మానికి మంచిది.

అవకాడో: ఇందులోని విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్స్ శరీరాన్ని రక్షిస్తాయి.

డార్క్ చాక్లెట్: ఇది వైట్ బ్లడ్ సెల్స్‌ను రక్షిస్తుంది.

వెల్లులి: ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఇమ్యునిటీ పెంచుతాయి.

బాదం: ఇందులోని విటమిన్-ఇ శరీరంలోని రోగ నిరోధక శక్తిని ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

సిట్రస్ ప్రూట్స్: నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ ఫ్రూట్స్‌ తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహకరిస్తాయి.

పసుపు: ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. కండరాల గాయాలను నయం చేసే గుణం ఇందులో ఉంది.

దానిమ్మ: ఇది ఇ-కోలి, సల్మోనెల్లా, లిస్టేరియా వంటి బ్యాక్టీరియాలతో పోరాడేందుకు సహకరిస్తుంది.

ఇంకా గుడ్లు, అల్లం, బొప్పాయి, సన్ ఫ్లవర్, పుచ్చకాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.

Images Credit: Pixabay, Pexels and Unsplash