గుండెకి మేలు చేసే పదార్థాల మీద కంటే హాని చేసే వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాని వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు.



ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వులు గుండెకి హాని చేసే పదార్థాల జాబితాలో ముందుంటాయి.



చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వుల అధిక వినియోగం కూడా హృదయ సంబంధ వ్యాధుల పెరుగుదలని ప్రేరేపిస్తాయి.



అధిక చక్కెర వినియోగం బరువును పెంచుతుంది. ఇన్సులిన్ ని నిరోధిస్తుంది.



రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్‌కు ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె వైఫల్యానికి దారి తీస్తాయి.



ప్రాసెస్ చేసిన, రెస్టారెంట్ ఆహారాల్లో అధిక ఉప్పు ఉంటుంది. దీని వల్ల రక్తపోటు పెరిగిపోతుంది.



ఉప్పు ధమనుల మీద భరించలేని ఒత్తిడి పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్, హృదయ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.



సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ కొవ్వులు ధమనుల్లో ఫలకాలు ఏర్పడేలా చేస్తాయి.



ఈ ఫలకాల వల్ల రక్తప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. గుండె పోటు సంభవిస్తుంది.



అధిక బరువు శరీరంలోని మొదట ప్రభావం చూపేది గుండెపైనే.
బరువు పెరగకుండా ముందు నుంచే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం.


గుండెకు ప్రోటీన్లు నిండిన ఆహారం అవసరం. చిక్కుళ్ళు,
బఠానీలు, చేపలు, బాదం, పిస్తా వంటివి అధికంగా తినేలా చూసుకోవాలి.