గోధుమ పిండి కంటే మైదా పిండికి త్వరగా పురుగులు పట్టేస్తాయి.



ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పిండికి పురుగులు పట్టడం వల్ల పారేయాల్సి వస్తుంది.



అందుకే పిండి భద్రపరిచే విషయంలో ఈ టిప్స్ పాటించి చూడండి. ఎన్ని రోజులైనా సరే పురుగు అనేది పట్టదు.



పిండి చుట్టూ తేమ ఉండటం వల్ల పురుగు వచ్చేస్తుంది. ముందుగా పిండి తడి కాకుండా చూసుకోవాలి.



వంటగదిలో పిండి నిల్వ చేయడానికి అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు ఉపయోగించాలి.



పిండిని నిల్వ చేసే ముందు అందులో రెండు స్పూన్ల ఉప్పు కాగితంలో చుట్టి పాత్రలో పెట్టండి



పురుగులు చేరకుండా అందులో బే ఆకులు కూడ వేసుకోవచ్చు.



పిండి గాలి చొరబడని ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.



పురుగులు పట్టకుండా ఉండాలంటే పిండి పెట్టిన పాత్ర చుట్టూ ఎండు మిరపకాయలు ఉంచాలి.



ఈ సింపుల్ పద్ధతులతో పిండి పురుగులు పట్టకుండా నివారించుకోవచ్చు.
Images Credit: Pixabay/ Pexels