ఒక సారి శరీరంలో కొవ్వు చేరితే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం

సునాయసంగా బరువు తగ్గే చిట్కాలను గురించి నిపుణులు వివరిస్తున్నారు అవేమిటో తెలుసుకుందాం.

మూడు పూటలా తప్పకుండా భోంచేస్తూ బరువుతగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే తినే ఆహారం పరిమాణాన్ని నిర్ణయించుకోవడానికి చేతులు ఉపయోగించాలట

ప్రతి భోజనంలో పిడికెడు కార్బోహైడ్రేట్లు, పిడికెడు ప్రొటీన్లు, పెద్ద దోసిలి నిండా కూరగాయలు ఉండేట్లు జాగ్రత్త పడాలి.

ఈ నియమాలను అనుసరించి భోంచేస్తే బరువు గణనీయంగా తగ్గుతారట.

మొదలు పెట్టిన 6 వారాల్లో విసరల్ ఫ్యాట్ దాదాపు 14 శాతం తగ్గినట్టు గమనించారట.

ఇలాంటి డైట్ ప్లాన్ తో రోజుకు రెండు పిడికిళ్ల పరిమాణంలో పండ్ల ముక్కలు కూడా తినొచ్చు. స్నాక్స్ కూడా ఎంజాయ్ చెయ్యవచ్చు.

ఇలా ప్రత్యేక వ్యాయామాలు చెయ్యకుండానే నడుము చుట్టు కొలత తగ్గించుకోవచ్చట.
Representational Image : Pexels