పెరుగు ఎందుకు తినాలంటే...



కొందరు పెరుగు తినడానికి ఇష్టపడరు. కానీ ప్రతిరోజూ కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెరుగు కూడా ఒకటి.



పెరుగు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మన జీర్ణ5 వ్యవస్థను మెరుగుపరుస్తుంది.



ఆహారం తిన్నాక పెరుగు తింటే పొట్టలోని ఆమ్లాలు నియంత్రణలో ఉంటాయి.



పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి రెండు మన శరీరానికి చాలా అవసరం.



పెరుగు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.



పెరుగు తినడం వల్ల అధికరక్తపోటు అదుపులో ఉంటుంది.



మధుమేహం ఉన్న వారు కచ్చితంగా పెరుగును తినాలి.



తరచూ కడుపునొప్పి వస్తున్నవారు పెరుగును రోజూ తినాలి.