వంటగదిలో ఉండే ఎన్నో మసాలాలు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే ఎలాంటి మసాలా దినుసులతో ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది గుండె సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి దీనిని మీరు డైట్లో చేర్చుకోవచ్చు. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దాల్చిన చెక్కలో కూడా కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే లక్షణాలు ఉన్నాయి. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ మొత్తం ఆరోగ్యానికి మంచివి. కొత్తిమీర కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. పొటెన్షియల్ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. మెంతుల్లో కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలు ఉంటాయి. (Images Source : Unsplash) గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.