పొద్దున్నే కాఫీ లేనిదే చాలా మందికి బండి ముందుకు కదలదు. కానీ కొంత మంది కాఫీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియల వేగం తక్కువగా ఉన్న వారు కెఫిన్ ను సరిగా ప్రాసెస్ చెయ్యలేరు. అందువల్ల కప్పు కాఫీ తర్వాత దాదాపు 9 గంటల వరకు కూడా ఆందోళన వంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి రావచ్చు. గర్భవతులు కాఫీ మితంగా తీసుకోవడం మంచిది. కెఫిన్ శిశువు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 1 లేదా 2 కప్పుల కాఫీ దీర్ఘకాలికంగా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే ఈ మంచి ఫలితాల కోసం ఇతర కెఫిన్ కలిగిన డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటివి తీసుకోకుండా ఉండాలి. కాఫీ తాగాలనుకుంటే పాలు, చక్కెర కలపకుండా తాగితే మంచిది. టైమ్ పాస్ కోసం కాకుండా అవసరం ఉంటేనే తాగాలి. కాఫీ ఎప్పుడూ భోజనంతో లేదా భోజనం తర్వాత వెంటనే తీసుకోవద్దు. పోషకాల శోషణలో అంతరాయం ఏర్పడవచ్చు. ప్రీవర్కవుట్ డ్రింక్ గా తీసుకోవాలని అనుకుంటే వర్కవుట్ కి అరగంట ముందు తీసుకోవాలి.