కోపం ఎక్కువగా రావడానికి కారణాలు ఇవి కావచ్చు

కోపం అనేక అనర్థాలకు కారణం అవుతుంది. బంధాలను విడగొడుతుంది. స్నేహాన్ని చెరిపేస్తుంది.

అప్పుడప్పుడు కోపం వస్తే ఫర్వాలేదు కానీ తరచూ ఇంకా చెప్పాలంటే రోజూ వస్తుంటే మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.

ఒత్తిడి చాలా అనారోగ్యాలకు కారణం. అలాగే కోపానికి కూడా కారణం అని చెప్పుకోవచ్చు.

ఇంట్లో నిత్యం గొడవలు అవుతున్నా కూడా మానసికంగా మీరు మారిపోతారు. ఎల్లప్పుడూ కోపంగా ఉంటారు.

బాధాకరమైన, విషాదకరమైన గతాన్ని అనుభవించినట్లయితే అలాంటివారికి ఎటువంటి కారణం లేకుండా కోపం రావచ్చు.

ఆర్ధిక అవసరాలు అధికంగా ఉన్నప్పుడు వాటి వల్ల కూడా మానసికంగా మార్పులు వస్తాయి. తీవ్రమైన కోపం, అసహనం వస్తుంది.

తీరని దుఃఖం కూడా మానసికంగా చాలా కుంగదీస్తుంది.తీవ్రమైన దుఃఖం కోపంగా మారిపోతుంది.

యాంగ్జయిటీ, డిప్రెషన్లో ఉన్నవాళ్లలో కూడా కోపం అధికంగా వచ్చే అవకాశం ఉంది.