చలికాలంలో శరీరం డీహైడ్రేట్ అయి చర్మం పొడి బారిపోకుండా ఉండాలంటే ఇవి తాగాల్సిందే.

చలికాలంలో కూడా తప్పని సరిగా ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగడం చాలా ముఖ్యం.

గ్రీన్ జ్యూస్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తుంది.

వేడి వేడి సూప్ తాగడం వల్ల శరీరం వెచ్చగా అనిపిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా పేగులకి మంచి చేస్తుంది.

రకరకాల పండ్లతో తయారు చేసిన స్మూతీస్ కూడా తీసుకోవచ్చు.

వెచ్చని హెర్బల్ టీ తాగడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందిస్తాయి.

పగటి పూట గ్రీన్ టీ ఆస్వాదించవచ్చు. ఇక రాత్రి సమయంలో చామంతి పూల టీ వంటి విభిన్నమైన వాటిని ఎంచుకోవచ్చు.

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image Source: Pexels

పసుపు కలిపిన పాలు తీసుకుంటే ప్రోటీన్, కాల్షియం లభిస్తాయి. రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి.