ఆఫీసుకు మీరు టైమ్‌కు వెళ్తారా? ఆలస్యంగా వెళ్తారా? ఆలస్యమైతే ఏం జరుగుతుందో తెలిసిందే.

మీ శరీరం కూడా టైమ్ పాటిస్తుంది. టైమ్‌కు నిద్రాహారాలను కోరుకుంటుంది. అదే ‘జీవగడియారం’.

‘జీవగడియారం’ అదుపుతప్పితే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, గుండె సమస్యలు వస్తాయి.

శరీరంలో వివిధ రకాల పనులను నియంత్రించే సైక్లింగ్ ప్రాసెస్ (సిర్కాడియన్ రిథమ్) దెబ్బతింటుంది.

జీవగడియారాన్ని.. చేతిగడియారంలో సరిచేసుకోవడం కుదరదు. తేడా వస్తే.. ప్రాణాలకే ముప్పు.

సమయానికి తిని, సమయానికి నిద్రపోతేనే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

రాత్రివేళ లైట్స్ డిమ్ చేసుకుని నిద్రపోవాలి. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీలు చూడొద్దు.

నిద్ర ఆపుకుని పనులు చేయడం, సమయానికి తినకుండా కడుపు మాడ్చుకోవడం మంచిది కాదు.

శరీరానికి తప్పకుండా ఎండ తగలాలి. రోజూ కనీసం అరగంటైనా ఉదయపు ఎండలో గడపండి.

Images Credit: Pexels