జాతీయ జెండా ఎగురవేయాలంటే నియమాలివే

జెండా పండుగ రోజు ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

జాతీయ జెండాను ఎగురవేశాక, ఆ జెండా కన్నా ఎత్తులో ఇతర ఏ జెండా ఉండకుండా చూసుకోవాలి.

చిరిగిపోయిన, నలిగిపోయిన జెండాను ఎగురవేయకూడదు.

జెండాలో కాషాయరంగు పైకి ఉండేలా చూసుకోండి.

జెండాను మిగతా వస్త్రాల్లా చేతులు తుడుచుకునేందుకు, ఏవైనా వస్తువుల మీద కప్పేందుకు ఉపయోగించకూడదు.

జెండాలపై ఏమీ రాయకూడదు.

జాతీయ జెండా నేలపై పడేయకూడదు. నీటిలో పడేయకూడదు.

జాతీయ జెండాను కర్ర చివరనే కట్టాలి. మధ్యలో కట్టకూడదు.