ఈ తేనె తాగితే కిక్కెక్కిపోతుంది నేపాల్‌లో మాత్రమే దొరికే తేనె ‘మ్యాడ్ హనీ’ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన తేనె రకాల్లో మ్యాడ్ హనీ ఒకటి. నేపాల్ ప్రజలు చాలా ఏళ్లుగా దీన్ని ఔషదంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని క్రీస్తుపూర్వం 2100 నుంచి నేపాల్ లో ఉపయోగిస్తున్నట్టు ఆ అధ్యయనంలో తేలింది. ఈ తేనెలో గ్రేయనోటాక్సిన్స్ అని పిలిచే మత్తును కలిగించే విషపూరితమైన పదార్థం కలుస్తుంది. ఈ మత్తు పదార్ధం రోడోడెండ్రాన్ జాతి మొక్కలకు పూసే పూల పుప్పొడిలో లభిస్తుంది. ఆ పూల నుంచి తేనెను గ్రహించిన తేనెటీగల వల్ల ఇలాంటి మ్యాడ్ హనీ తయారవుతుంది. ఈ తేనెను మితంగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని కాస్త తాగితేనే మద్యం తాగినట్టు కిక్కెక్కిపోతుంది. అధికంగా తాగితే మరణం సంభవిస్తుంది.