పదినిమిషాల్లో శెనగపిండి దోశె



శెనగపిండి - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పసుపు - చిటికెడు
పచ్చి మిర్చి - ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడినంత

గిన్నెలో శెనగపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.



నీళ్లు కలిపి దోశెల పిండిలా కలుపుకోవాలి.

ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.

నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు.

పెనంపై నూనె రాసి దోశెలా వేసుకుంటే సరి. పదినిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది.