రక్తం నుంచి వ్యర్థాలు, ద్రవాలు ఫిల్టర్ చేయడంలో కీలక పాత్ర మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఆహారాలు దూరం పెట్టాల్సిందే.
ప్రాసెస్ చేసిన మాంసాలలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్ లు ఉంటాయి. జంతు ప్రోటీన్ అతిగా తీసుకోవడం వల్ల హైపర్ ఫిల్ట్రేషన్ కి దారి తీస్తుంది.
పాల ఉత్పత్తుల్లో భాస్వరం ఉంటుంది. ఇది కిడ్నీ వ్యాధి ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది.
నోటికి ఎంతో రుచిగా ఉండే ఊరగాయలు అధిక సోడియం కంటెంట్ తో ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా ఊరగాయలకి దూరంగా ఉండాలి.
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. బదులుగా పైనాపిల్ తీసుకోవచ్చు.
బంగాళాదుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవాలని అనుకున్నప్పుడు రాత్రిపూట నీటిలో నానబెట్టడం చేయాలి.
తీపి సోడా, కోలాస్ తాగడం మానేస్తే మంచిది. ఇవి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేలా చేస్తాయి.
అధిక ఉప్పు వినియోగం రక్తపోటుని పెంచుతుంది. మూత్రపిండాలని ఒత్తిడికి గురి చేస్తుంది.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల ఆధారిత ప్రోటీన్ తీసుకోవడం మంచిది. Images Credit: Pexels/ Unsplash