నిత్యం మొబైల్ చూస్తూ, కంప్యూటర్, టీవీల ముందు కూర్చునే మనం.. కళ్లకు కాస్త రెస్ట్ ఇవ్వాలి.

అంతేకాదు, కంటి చూపు పోకుండా ఉండేందుకు ఈ సింపుల్ వ్యాయామాలను కూడా పాటించాలి.

మీ చేతిని ముందుకు చాచి బొటనవేలుపై 15 సెకన్లు ఫోకస్ పెట్టండి.

రెండు అరచేతులతో మూసిన కళ్లను 2 సెకన్లు నొక్కండి.

కనుగుడ్లను కొన్ని సెకన్లపాటు కుడి, ఎడమ వైపుకు, గుండ్రంగా తిప్పండి.

మీకు దూరంగా ఉన్న వస్తువుపై ఏదైనా అక్షరం రాసి దాన్ని ఏకాగ్రతతో 20 సెకన్లు చూడండి.



కొన్ని సెకన్లపాటు రెప్పలు వేస్తూ తెరవడం కూడా మంచి వ్యాయామం.



ఒక పెన్సిల్ తీసుకుని దాని కొనను చూస్తూ ముక్కు వరకు తీసుకురండి. కొన్ని సెకన్లు రిపీట్ చేయాలి.

Images Credit: Pexels