షుగర్ అదుపులో పెట్టుకోవాలని అనుకున్నా, బరువు తగ్గాలని అనుకున్నా అరటి పండు తినటం మానేస్తారు.

అరటి పండులో పొటాషియం పుష్కలం. శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది.

బీపీ అదుపులో ఉంచుతుంది. కండరాలు, నాడీ ఆరోగ్యానికి అవసరం.

సమతుల ఆహారంలో భాగంగా వాటి ద్వారా అందే క్యాలరీలతో సంబంధం లేకుండా 3-5 సర్వింగ్స్ తాజా పండ్లు, కూరగాయలు ఉండాలి.

బరువు తగ్గాలనే వారు, డయాబెటిస్ కంట్రోల్ లో లేని వారు అరటి పండ్లు కొంత కాలం తీసుకోకపోవడమే మంచిది

100గ్రాముల అరటి పండు ముక్కల్లో దాదాపు 112 క్యాలరీలు ఉంటాయి.

ఇది 500 గ్రాముల బొప్పాయి, 5 జామపండ్లు, ఒక పెద్ద ఆపిల్ తో సమానం.

బరువు తగ్గాలనుకున్నా, డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలని అనుకున్నా ఒక చిన్న అరటికాయ తీసుకోవచ్చు.

అరటి పండ్లు పోషకాహారమే కానీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే బరువు పెరుగుతారు, రక్తంలో షుగర్ స్థాయిలు కూడా పెరుగుతాయి.

పూర్తిగా పండిన అరటి పండులో ఎక్కువ షుగర్ ఉంటుంది. వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.

ఎంత పండిందనేది ఒకటే కాదు, ఎంత సైజులో ఉందనేది కూడా ముఖ్యమే.

కాబట్టి మధుమేహులు చిన్న అరటి పండు అంత ఎక్కువ పండని దాన్ని తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు.

Representational Image : Pexels