రకరకాల కారణాలతో ఈ మధ్య చాలా మంది కళ్లకింద నల్లని వలయాలతో బాధపడుతున్నారు.

ఈ సమస్యతో కళ్లు నిస్తేజంగా కనిపిస్తాయి. కొన్ని చిన్న ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారాలు తెలుసుకుందాం



కీరదోస ముక్కలను చక్రాలుగా కట్ చేసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టి ఈ ముక్కలను కళ్ల మీద పెట్టుకోవాలి.

బంగళాదుంపల్లో బ్లీచింగ్ ఎజెంట్లు, ఎంజైములు ఉంటాయి. బంగాళదుంప చక్రాలు కళ్ల మీద పెట్టుకోవాలి.

గ్రీన్ లేదా బ్లాక్ టీ వంటి కెఫిన్ టీ బ్యాగ్ లు వాడిన తర్వాత వాటిని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి వాటిని కంటి మీద పెట్టుకోవాలి.

బాదం నూనె రాత్రి నిద్రకు ముందు కళ్ల కింద సున్నితంగా మసాజ్ చెయ్యాలి. రాత్రంతా అలాగే వదిలెయ్యాలి.



చిటికెడు పసుపు పొడిలో కొన్ని చుక్కల పాలు లేదా రోజ్ వాటర్ కలిపి కళ్లకింద నల్లని వలయాలకు రాయాలి.

10-15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
Representational Image : Pexels