విటమిన్ ఏ ఉంటుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది. జుట్టు పెరుగుదల కోసం ఆహారంలో విటమిన్ ఇ ని చేర్చుకోవాలి. బాదంపప్పులో ఇది సమృద్ధిగా లభిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ డి అవసరం. పుట్టగొడుగులో పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ బి12, మెగ్నీషియం సోయా పాలలో లభిస్తాయి. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. ఇనుము బాగా గ్రహించడానికి శరీరానికి విటమిన్ సి అవసరం. అందుకోసం నారింజ వంటి సిట్రస్ పండ్లు తీసుకోవాలి. బచ్చలికూరలో జింక్, ఐరన్ ఉంటుంది. జుట్టుకి మేలు చేస్తుంది. గుడ్లు జుట్టుకి పోషణ అందించమే కాదు పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది.