Image Source: pexels.com

మాంసం, చేపలు, పాల ఉత్పత్తులను ఫ్రిజ్ లోనే స్టోర్ చేస్తారు. కొన్ని కిరాణా సామాన్లు కూడా ఫ్రిజ్ లో స్టోర్ చేయాలని తెలుసా?

Image Source: pexels.com

ఖర్జూరాను ఎల్లప్పుడూ ఫ్రిజ్ లోనే స్టోర్ చేయాలి. క్రాన్ బెర్రీస్ లేదా ఆప్రికాట్ వంటివి ఫ్రిజ్ నిల్వచేస్తే తాజాగా ఉంటాయి.

Image Source: pexels.com

ఆవాలను వంట గదిలో కాకుండా.. ఒక డబ్బాలో పోసి ఫ్రిజ్ లో నిల్వ చేస్తే రంగును కోల్పోవు.

Image Source: pexels.com

జామ్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బయట పెడితే పాడవుతుంది. కాబట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేయాలి.

Image Source: pexels.com

గుడ్లను ఎప్పుడూ ఫ్రిజ్ లోనే స్టోర్ చేయాలి. బయట ఉంటే వాటి షెల్ బలహీనంగా మారుతుంది.

Image Source: pexels.com

నువ్వుల నూనెతోపాటు ఇతర శుద్ధి చేయని గింజల నూనెలను ఎల్లప్పుడూ ఫ్రిజ్ లోనే స్టోర్ చేయాలి. బయట ఉష్ణోగ్రతకు మెతక వాసన పడుతాయి.

Image Source: pexels.com

అవిసె గింజలు, అవిసె నూనెను ఫ్రిజ్ లోనే ఉంచాలి. ఇవి ఆల్పా లినోలెనిక్ యాసిడ్ ను కలిగి ఉంటాయి. బయటపెడితే వాటిలోని పోషకాలు చెడిపోతాయి.

Image Source: pexels.com

మెరినేడ్, సలాడ్ డ్రెస్సింగ్ లలో ఉపయోగించే ఇన్ఫ్యూజ్డ్ నూనెలను కూడా ఫ్రిజ్ లోనే ఉంచాలి.

Image Source: pexels.com

కెచప్ లో అధిక వెనిగర్, ఉప్పు, చక్కెర కంటెంట్ ఉంటుంది. దీన్ని కూడా ఫ్రిజ్ లోనే నిల్వ ఉంచాలి.

లెమన్ జ్యూస్ ఫ్రిజ్ ఉంచడం మంచిది. బయట ఉంచితే రుచి కోల్పోతుంది.



Image Source: pexels.com

యాపిల్స్ ను ఫ్రిజ్ లోనే స్టోర్ చేయాలి. ఇథిలీన్ వాయువును రిలీజ్ చేస్తాయి. ఫ్రిజ్ లోఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Image Source: pexels.com

చాక్లెట్ సిరప్ లో కూడా చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఫ్రిజ్ లో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

Image Source: pexels.com

స్వీట్ కార్న్ ఎల్లప్పుడూ ఫ్రిజ్ లోనే ఉంచాలి. బయటి ఉష్ణోగ్రతకు ఎండిపోతాయి. ఫ్రిజ్ లో స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.