పొడవైన జుట్టు మీద అందరికీ మోజే. జుట్టున్న అమ్మ కొప్పెలా ముడిచినా అందమే అంటుంటారు.

జుట్టు రాలుతోందంటే బెంగ పడేవారు కోకొల్లలు. మరి జుట్టెందుకు రాలుతోందో చూద్దాం.

ప్రొటీన్, బయోటిన్ అనే పోషకాలు జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరం. ఈ పోషకాలు తగ్గితే జుట్టు రాలుతుంది.

గుడ్డులో ప్రొటీన్ తో పాటు బయోటిన్ కూడా ఉంటుంది కనుక జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు తరచుగా గుడ్లు తింటుండాలి.

ఫోలెట్, విటమిన్ సి, ఐరన్ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. ఆకుకూరల్లో ఇవి పుష్కలం. కనుక క్రమం తప్పకుండా తినాలి.

చిలగడదుంపల్లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది స్కాల్ప్ ఆరోగ్యానికి అవసరం. చిలగడదుంపలు తినడం అన్ని రకాలుగానూ ఉపయోగకరం.

జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, జింక్, కొన్నిఫ్యాటీఆసిడ్లు బాదాములు, అక్రూట్ వంటి డ్రైఫ్రూట్స్ ద్వరా అందుతాయి.

ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు జుట్టు పెరిగేందుకు అవసరం. ఇవి చేపనూనెలో పుష్కలం.

స్పెర్మిడిన్ అనే సమ్మేళనం జుట్టు చాలా కాలం వరకు పేరిగేందుకు అవసరం. ఇది సోయాబీన్ నుంచి లభిస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!



Images courtesy : Pexels