చర్మం శరీరంలో అతి పెద్ద అవయవం. అంతేకాదు పూర్తి శరీరానికి రక్షణ కవచం.

చర్మ ఆరోగ్యానికి కొన్ని పోషకాలు చాలా అవసరం. అవేమిటో తెలుసుకుందాం.

విటమిన్ Dలో క్యాల్సిట్రియోల్ ఉంటుంది. ఇది చర్మంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

ప్రతిరోజూ ఒక పదినిమిషాల పాటు సూర్యరశ్మిలో గడిపితే విటమిన్ D శరీరానికి అందుతుంది.

సాల్మన్, ట్యూనా వంటి చేపలు, చికెన్, గుడ్డు ద్వారా కూడా విటమిన్ D పొందవచ్చు.

విటమిన్ C చాలా రకాల యాంటీఏజింగ్ స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో చూస్తుంటాము. ఇది ఒక యాంటీఆక్సిడెంట్.

చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. విటమిన్ C కోసం సిట్రస్ పండ్లు తీసుకోవడం అవసరం.

విటమిన్ E కూడా మరో యాంటీఆక్సిడెంట్. ఇది హానికర యూవీ కిరణాలను శోషిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

బాదాములు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసెగింజల ద్వారా విటమిన్ E శరీరానికి అందుతుంది.

విటమిన్ K రక్తస్కందనకు తోడ్పడుతుంది. అంతేకాదు చర్మం మీద స్ట్రెచ్ మార్క్స్, ఇతర మరకలను కూడా తొలగిస్తుంది.

కాలే, పాలకూర, లెట్యూస్, క్యాబేజ్ వంటి వాటి నుంచి తగినంత విటమిన్ K లభిస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!



Images courtesy : Pexels