Image Source: pexels.com

సిట్రస్ పండ్లలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్ తోపాటు నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

Image Source: pexels.com

దుంపల్లో నైట్రేట్ అధిక మొత్తంలో ఉంటుంది. రక్తనాళాల విస్తరణను ప్రోత్సహిస్తారు. రక్తపోటును తగ్గించడంతోపాటు రక్తప్రసరణకు సహాయపడతాయి.

Image Source: pexels.com

కొవ్వు చేపలలో లభించే ఒమేగా-3కొవ్వు ఆమ్లాలు వాపును తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

డ్రైఫ్రూట్స్ తోపాటు చియా సిడ్స్ లో ఒమేగా-3 యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

పసుపులో ఉండే కర్కుమిన్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది.

Image Source: pexels.com

రక్తనాళాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించే సమ్మేళనాలు వెల్లుల్లిలో ఉన్నాయి. రక్తపోటును తగ్గించడంతోపాటు మెరుగైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది.

Image Source: pexels.com

ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్న డార్క్ చాక్లెట్ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఎక్కువగా కోకో కంటెంట్ ఉన్న చాక్లెట్స్ తినడం మంచిది.

Image Source: pexels.com

బెర్రీలు ఆక్సీకరణ, ఒత్తిడి,వాపును తగ్గిస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

Image Source: pexels.com

పుచ్చకాయ రక్తనాళాలను సడలించడంలో సహాయపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ గా మారే అమినో యాసిడ్ సిట్రుల్లైన్ అధికంగా ఉంటుంది.