ప్రమాదాల వల్ల కీళ్లు లేదా ఎముకల గాయల పాలైన వారికి శీతాకాలంలో ఆ బాధలు ఎక్కువ అవుతాయి.

ఇలా పాత నొప్పులు తిరగబెట్టడానికి కారణాలు ఏమిటీ?

చలి వేళల్లో వాతావరణంలో పీడనం మారుతుంది. ఈ పీడన ప్రభావం శరీరంలో ఉండే ఫ్లూయిడ్ మీద ఉంటుంది.

ముఖ్యంగా చీలమండలు, మోకాలు కీలు ఎక్కువ ఈ ప్రభావానికి గురవుతారు.

తగ్గిన ఒత్తిడి మూలంగా ద్రవాలు త్వరగా చీలమండల చుట్టూ చేరుతాయి.

అందువల్ల నాడుల మీద ఒత్తిడి పెరిగి అసౌకర్యం పెరుగుతుంది.

ఆర్థొపెడిక్ గాయాలు ఉన్నవారికి ఈ ఒత్తిడి వల్ల నొప్పి పెరుగుతుంది. తగ్గిన ఉష్ణోగ్రతలు ఈ నొప్పిని ట్రిగర్ చేస్తాయి.

చల్లని వాతావరణంలో క్రమం తప్పని వ్యాయామం ద్వారా కండరాలను బలోపేతం చేయ్యాలి.

చల్లని వాతావరణంలో చురుకుగా లేకపోతే కీళ్లు, కండరాలు బిగుసుకుంటాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels