పొటాషియం శరీరానికి ఆవశ్యకమైన మినరల్, ఎలక్ట్రోలైట్. రకరకాల శరీరధర్మాల నిర్వహణకు అవసరం.

పోటాషియం తగ్గితే రకరకాల లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి. అవేమిటో చూద్దాం.

ఎప్పుడూ నీరసంగా ఉండడం, నిరంతరం అలసటగా ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండానే అలసిపోతుంటారు.

కండరాలు పటిష్టంగా ఉండేందుకు పొటాషియం అవసరం. లోపం ఏర్పడితే కండరాల్లో బలహీనత, క్రాంప్స్ వంటి సమస్యలు వస్తాయి.

గుండె వేగం అకస్మాత్తుగా పెరిగినట్టు గుండె దడగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి పొటాషియం చాలా అవసరం.

కడుపు ఉబ్బరంగా ఉండడం, మలబద్దకం వంటి జీర్ణసంబంధ సమస్యలు కూడా వస్తాయి.

అరికాళ్లలో తిమ్మిరి వంటి లక్షణం కూడా పొటాషియం లోపం వల్ల కలుగుతుంది.

పాలకూర, అవకాడో, బంగళాదుంపలు, అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!



Images courtesy : Pexels