ఒక వయసు తర్వాత జ్ఞాపక శక్తి తగ్గేందుకు కారణాలను కొత్త అధ్యయనాలు వివరిస్తున్నాయి.

30, 40 ఏళ్లలో నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్న వారు భవిష్యత్తు 10 ఏళ్లలో జ్ఞాపకశక్తి సమస్యలు రావచ్చట.

ఈ అధ్యయనం అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజి మెడికల్ జర్నల్ న్యూరాలజి ఆన్లైన్ ఎడిషన్ లో ప్రచురించారు.

నిద్ర నాణ్యతను, వ్యవధిని అధ్యయనం చెయ్యడం ద్వారా ఈ వివరాలను ప్రచురించారట.

236 మంది పాల్గొన్న ఈ అధ్యయనంలో 46 శాతం మంది నిద్ర నాణ్యత లేకుండా గడుపుతున్నట్టు తేలింది.

యవ్వనంలో నిద్ర సమస్యలు ఉన్నవారికి మధ్య వయసులో సమస్యలు పెద్దగా కనిపించలేదు.

కానీ నడివయసులో నిద్ర సమస్యలు ఉన్నవారి మెదడు పనితీరు మీద దశాబ్ధకాలంలో దుష్ప్రభావాలు ఉంటున్నట్టు గమనించారు.

మీకు నిద్ర మధ్యలో అంతరాయం ఏర్పడుతున్నా, కంటి నిండా నిద్ర పట్టకపోయినా భవిష్యత్తులో గజినీలు అయిపోతారట.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels