సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఏం కొనాలన్న అందరూ మొదట చూసేది ఎక్స్‌పైరీ డేట్. ఆ తేదీని బట్టే ఆ ఉత్పత్తిని వాడవచ్చు, తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు.
అసలు ఎక్స్‌పైరీ తేదీయే లేని ఆహార ఉత్పత్తులు కూడా ఉన్నాయి.
ఎన్నాళ్ల తరువాత వీటిని వాడుకున్నా ఏం కాదు, రుచి, రూపం, రంగు మారదు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమే.
సముద్రం నుంచి తీసిన స్వచ్ఛమైన ఉప్పు ఎన్ని సంవత్సరాలైన అలాగే ఉంటుంది. అయోడిన్, ఇతర సమ్మేళనాలు చేర్చబడిన ఉప్పు మాత్రం కొన్ని నెలల తరువాత పాడయ్యే అవకాశం ఉంది.
తేనెకు గడువు తేదీ అంటూ ఏదీ లేదు.ఈజిప్టులోని మమ్మీల సమాధుల్లో వందల ఏళ్ల నాటి తేనెను శాస్తవేత్తలు రుచి చూసి కితాబు కూడా ఇచ్చారు.
ఏ ఇతర పదార్థం కలపని, ప్రాసెస్ చేయని కాఫీ గింజలు లేదా పొడి ఎన్ని ఏళ్లయినా రుచి కోల్పోకుండా, పాడవకుండా అలానే ఉంటాయి.
సోయా సాస్ కూడా ఏళ్ల పాటూ పాడవకుండా ఉంటుంది. దీన్ని తయారుచేసే ప్రక్రియలో పులియబెట్టడం (Fermentation) అనేది ముఖ్యం. అందుకే అది పాడవదు.