కాఫీలోని కెఫీన్ ఐరన్ స్థాయిలపై ఒత్తిడిని తీసుకొస్తుంది. దీని వల్ల జుట్టు రాలిపోతుంది. మద్యపానం చేసే చాలా మంది వ్యక్తులు సరైన ఆహారం తీసుకోరు. దీని వల్ల పోషకాలు అందవు. జుట్టు రాలిపోతుంది. సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి కార్బొనేటెడ్ పానీయాలు జుట్టుకి చాలా హానికరం. పాలలో కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది. ఇవి పెరిగితే జుట్టు రాలడానికి దారితీస్తుంది. జుట్టుని పెంచే ఆరోగ్యకరమైన పానీయాలు ఉసిరి జ్యూస్: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సెల్ డ్యామేజ్‌ను నిరోధించి హెల్తీ హెయిర్ గ్రోత్ ని ప్రోత్సహిస్తుంది. క్యారెట్ జ్యూస్: విటమిన్లు ఏ, బి, ఇ, యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్. జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. కలబంద చర్మంతో పాటు జుట్టుని కూడా ఫిట్ గా ఉంచుతుంది. ఇందులోని విటమిన్లు ఏ, సి, ఇ ఉన్నాయి. బచ్చలికూర రసం: బచ్చలికూరలో ఐరన్, బయోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలని ఇది ఇస్తుంది.