జీలకర్ర తినడం వల్ల ఉపయోగం ఉందా? జీలకర్రను చాలా మంది తేలికగా తీసుకుంటారు. కూరల్లో వేయరు కూడా. జీలకర్రను రోజూ ఆహారంలో తినాల్సిన అవసరం ఉంది. జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. తింటే శరీరంలో వాపు, నొప్పి రావు. బరువు తగ్గాలనుకునేవారు జీలకర్రను రోజూ తినాలి. జీలకర్ర నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. జీర్ణవ్యవస్థ సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవు. పొట్టలో నులిపురుగులు రాకుండా అడ్డుకుంటాయి. పొట్ట ఉబ్బరం రాకుండా కూడా జీలకర్రలోని సుగుణాలు రక్షిస్తాయి.