ఇంట్లోనే టమోటో కెచప్ తయారీ

టమోటాలు - ఒకటిన్నర కిలోలు
ఉల్లిపాయ పొడి - 1/2 స్పూను
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
ఆపిల్ సెడర్ వెనిగర్ - రెండు స్పూన్లు

బీట్రూట్ - అర ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
తాటి బెల్లం - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు
ఎర్ర కారం - ఒక స్పూను

కళాయిలో ఆలివ్ ఆయిల్ వేయాలి. అందులో తరిగిన బీట్రూట్, టమోటా ముక్కలను వేసి ఉడికించాలి.

మెత్తగా ఉడికాక స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి.

టమోట మిశ్రమాన్ని తీసి మిక్సీ జార్లో వేయాలి. అందులో పైన చెప్పిన మిగతా పదార్థాలను కూడా వేసి కొంచెం ఆలివ్ నూనె, నీళ్లు కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

అంతే టమోటో కెచప్ రెడీ అయినట్టే.

ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో వేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటూ నిల్వ ఉంటుంది.

నిల్వ ఉండేందుకు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కాబట్టి ఇది ఎంతో ఆరోగ్యకరం.