మెంతులు పొడి చేసుకుని కూరల్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది కూరల పోపుకే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

మెంతి ఆకులు పేస్ట్ చేసుకుని మొటిమలు ఉన్న చోట రాస్తే వాటి వల్ల వచ్చే నల్లమచ్చలు తొలగిస్తుంది.

బాలింతల్లో పాల ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. మెంతి కషాయం, మెంతి కూర పప్పు ఎలా అయినా తీసుకోవచ్చు.

మధుమేహం వల్ల వచ్చే ప్రమాదాలని అదుపులో ఉంచుతుంది. షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది.

మెంతుల నీళ్ళు తాగితే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

టెస్టోస్టెరాన్ ని పెంచి స్పెర్మ్ కౌంట్ పెరిగేలా చేస్తుంది.

విటమిన్లు ఏ, సి, కె, బి ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మెంతులు తేనెతో కలిపి తీసుకుంటే జ్వరం నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.



మెంతి పొడి జుట్టుకి పట్టించినా, మెంతులు వేసిన కొబ్బరి నూనె రాసుకున్నా చుండ్రు సమస్యని నివారించవచ్చు.

బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

Image Credit: Pixabay/ Pexels