వీటి వల్ల కూడా డయాబెటిస్ రావచ్చు



డయాబెటిస్ రావడానికి అధిక బరువు, వ్యాయామం చేయకపోవడం, అధిక రక్తపోటు కారణమని ఎక్కువమంది భావిస్తారు.



మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.



క్రిమిసంహారకాలు జల్లిన ఆహార పదార్థాలు, నాన్ స్టిక్ పాత్రలు, నిద్రలేమి, పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా వంటివి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.



డయాబెటిస్ రావడానికి వాయు కాలుష్యం కూడా ఎంతో దోహదపడుతుంది.



ఒకప్పుడు వయసు ముదిరిన వారికే డయాబెటిస్ వచ్చేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ దాడి చేస్తోంది.



గాలి కాలుష్యంలో కొన్ని రకాల లోహాలు శ్వాస ద్వారా డయాబెటిస్ బారిన పడేలా చేస్తాయి. కాబట్టి అధిక కాలుష్య ప్రాంతాల్లో నివసించకుండా ఉంటే మంచిది.



ప్లాస్టిక్ పరిశ్రమల్లో పనిచేసే వారు కూడా మధుమేహం బారిన అధికంగా పడుతున్నారు.



కాబట్టి తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు స్వచ్చంగా ఉండేలా చూసుకోండి. అలాగే వ్యాయామం తప్పకుండా చేయండి.