హైబీపీ లేకపోయినా ఉప్పు తినకూడదు



హై బీపీతో బాధపడుతున్న వారే ఉప్పును దూరంగా పెట్టాలని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు.



హైబీపీ లేని వ్యక్తులు కూడా ఉప్పును తగ్గించాల్సిందే.



అధిక రక్తపోటు లేదు కదా అని ఉప్పును అధికంగా తింటే వారికి గుండె ,మెదడు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు స్వీడన్ పరిశోధకులు చెబుతున్నారు.



అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుంది.



రక్తపోటు సాధారణంగా ఉన్నవారు కూడా ఉప్పు అధికంగా తినడం వల్ల వారికి భవిష్యత్తులో గుండె, మెదడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు.



హై బీపీ రావడానికి ముందే ఉప్పు వల్ల రక్తనాళాలు కూడా దెబ్బతింటున్నట్టు ఈ కొత్త అధ్యయనంలో కనుగొన్నారు.



రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడానికి ఉప్పుకి మధ్య సంబంధం ఉందని తేల్చారు. కాబట్టి ఉప్పు వల్ల గుండె, మెదడుకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్టు చెబుతున్నారు.



ఉప్పు ఎంతగా తగ్గిస్తే అంత మంచిది. నాలిక రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఉప్పుని దూరం పెట్టండి.