ఉల్లి గడ్డలు వీళ్లు తినకూడదట, మీరూ జాగ్రత్త - ఎందుకంటే..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. అది కొంతవరకు మాత్రమే నిజం.

ఉల్లి అన్నివిధాలా మేలు చేస్తుందని అదేపనిగా తినడం కూడా మంచిది కాదట.

అతిగా ఉల్లిని తింటే కడుపు ఉబ్బరం, డయేరియా వచ్చే అవకాశం ఉంది.

ఉల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ వల్ల శ్వాస నుంచి చెడు వాసన వస్తుందట.

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధిగ్రస్తులు ఉల్లికి దూరంగా ఉంటే మంచిది.

ఉల్లి వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయట.

అలెర్జీ సమస్యలు ఉన్నవారిలో దురద, దద్దుర్లు, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పచ్చి ఉల్లిపాయలు కొన్నిసార్లు డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలకు దారితీయవచ్చు.

మీకూ ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఉల్లికి దూరంగా ఉండటమే మంచిది.

Images and Videos Credit: Pexels and Pixabay