యానిమల్, టైగర్ 3, శామ్ బహదూర్, లేడీ కిల్లర్ సినిమాలు త్వరలో ఓటీటీలో స్ట్రీమ్ కానున్నాయి. ‘లేడీ కిల్లర్’ సినిమా నవంబర్ మూడో తేదీన విడుదల అయింది. ఈ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ నవంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. తేదీ కచ్చితంగా తెలియరాలేదు కానీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.460 కోట్లకు పైగా వసూలు చేసింది. శామ్ బహదూర్ సినిమా డిసెంబర్ 1వ తేదీన విడుదల అయింది. జీ5 లేదా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో జనవరి నుంచి ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఇక బ్లాక్‌బస్టర్ ‘యానిమల్’ కూడా డిసెంబర్ 1వ తేదీనే విడుదల అయింది. జనవరి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది.