మహిళలు రోజూ తినాల్సినవి ఇవే

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు రోజూ కచ్చితంగా తినాల్సిన ఆహారాలను, వాటిలో ఉండాల్సిన పోషకాలను చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడే ఈ ఆహారాలను తినడం వల్ల స్త్రీ ఆరోగ్యంగా జీవించగలుగుతుంది.

స్త్రీ తన ఆరోగ్యంపైనా, తను తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

ఇనుము - నట్స్, సీఫుడ్, బీన్స్, ఆకుపచ్చని కూరగాయలు

ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి - నట్స్, బీన్స్, బచ్చలి కూర, పాలకూర, నారింజలు

విటమిన్ డి - సూర్యరశ్మిలో నిల్చోవడంతో పాటు, గుడ్డులోని పచ్చ సొనలు, చీజ్, పాలు

కాల్షియం - పాలు, జున్ను, పెరుగు

మెగ్నీషియం - నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడోలు